లింగంపేట్‌లో బీజేపీలో సుమారు 100 మంది యువకుల చేరికలు

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సుమారు 100 మంది యువకులు బీజేపీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకగా నిలుస్తుందని అన్నారు. లింగంపేట్ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో యువకులు పార్టీలో చేరడం సంతోషకరమని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను యువత గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

లింగంపేట్ మండలంలో త్వరలో మరింత మంది యువకులు బీజేపీలో చేరనున్నారని ఎల్లారెడ్డి తెలిపారు. తాజాగా పార్టీలో చేరిన యువకులకు అండగా ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు.

అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. లింగంపేట్ పట్టణ కేంద్రంలో సుమారు 100 మంది యువకులు చేరారని, మరికొన్ని రోజుల్లో మరో 200 మంది యువకులు పార్టీలో చేరనున్నారని ఆయన తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలపై యువత, ప్రజల్లో ఆదరణ ఉందని క్రాంతికుమార్ పేర్కొన్నారు. అధికారంలో లేకపోయినా సొంత ఖర్చులతో ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని ఆయన అన్నారు. నియోజకవర్గానికి పైడి ఎల్లారెడ్డి వంటి నాయకుడు అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శివన్న గారి నవీన్ కుమార్, ఎల్లారెడ్డి నియోజకవర్గ బీజేవైఎం నాయకులు దాసరి అనిల్ కుమార్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నంద్యాల ఉదేశ్, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజారాం రమేష్, పట్టణ అధ్యక్షుడు నరేష్ భగవాన్, బీజేపీ వార్డు సభ్యులు పారిపల్లి సంతోష్ కుమార్, రాజారామ్ తల్వార్ సాయిలు, సంగమేశ్వర్, బెస్త లక్ష్మణ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply