అవగాహనతోనే హెచ్ఐవీ నివారణ సాధ్యం
దోమకొండలో హెచ్ఐవీ నివారణపై అవగాహన కార్యక్రమాలను తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థ బృందం బుధవారం సమీక్షించింది. సంస్థ ప్రతినిధులు డాక్టర్ తిరుమల్ రావు, కే. రమేష్ గ్రామపంచాయతీ, దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి, మహిళా గ్రామ సంఘాలను సందర్శించి లింక్ వర్కర్ స్కీమ్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు.
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన కల్పించేందుకు గోడలపై రాయించిన సందేశాలను బృందం పరిశీలించింది. కార్యక్రమాలకు గ్రామపంచాయతీ అందిస్తున్న సహకారాన్ని ప్రతినిధులు అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ తిరుమల్ రావు, కే. రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో హెచ్ఐవీపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహనతో పాటు నివారణకు సంబంధించిన జాగ్రత్తలు పాటించడం ద్వారా హెచ్ఐవీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
వివిధ వర్గాల ప్రజలతో వారు మాట్లాడి హెచ్ఐవీ నివారణలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కోరారు. లింక్ వర్కర్ స్కీమ్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, గ్రామ ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వైఆర్‌జీ కేర్ ఉమ్మడి జిల్లా డీఆర్పీ సుధాకర్, గ్రామ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, అమర్నాథ్, చింతల స్వామి, రెడ్‌క్రాస్ మండల అధ్యక్షుడు రవికుమార్, నాయకులు నాగారపు ఎల్లయ్య, శ్యాం కుమార్, గంగా రాములు, రాజయ్య, ఏఎన్‌ఎం సువర్ణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.