అక్టోబర్ 2న నిజామాబాద్‌లో జర్నలిస్టుల ర్యాలీ.. TUWJ జిల్లా కమిటీ పిలుపు
నిజామాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు TUWJ–IJU నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రకటించింది. IJU పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలిపింది.
అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపింది.
మండలాలు, పట్టణాల ప్రెస్ క్లబ్ సభ్యులు, రిపోర్టర్లు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని TUWJ–IJU జిల్లా కమిటీ కోరింది. తమ పరిధిలోని ప్రతి జర్నలిస్టుకు కార్యక్రమ సమాచారం అందించి ర్యాలీలో పాల్గొనేలా చేయాలని సూచించింది.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కమిటీ పిలుపునిచ్చింది.
ఈ మేరకు TUWJ–IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. అరవింద్ బాలాజీ ప్రకటన విడుదల చేశారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.