పొదిల రవికుమార్‌ను పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రవికుమార్‌ను పరామర్శించారు.
ఆదివారం స్వర్గీయ దేవేంద్రనాథ్, విజయలక్ష్మి దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం పొదిల రవికుమార్‌ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, పారా ఉదయ్, ఆకుతోట రాజశేఖర్, చౌడం నరసింహారావు, గడిల మధు, వాకాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.