కాజీపేటలో రూ.1.38 కోట్లకు పైగా రద్దు చేసిన పాత కరెన్సీ పట్టివేత
వరంగల్ కాజీపేటలో వాహనాల తనిఖీల సందర్భంగా రూ.1.38 కోట్లకు పైగా విలువైన రద్దు చేసిన పాత కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.1,38,50,000 విలువైన డీమోనిటైజ్డ్ పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.6,000 ఒరిజినల్ కరెన్సీ, 10 సెల్‌ఫోన్లు, ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడినట్లు సమాచారం. పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.