భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 06, 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
రెండు రోజుల్లో తన అనుచరులతో చర్చించి రాజీనామాపై అధికారిక ప్రకటన విడుదల చేస్తానని తాటి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అసంతృప్తితో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన తాటి వెంకటేశ్వర్లుకు ఆ పార్టీ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో అనంతరం ఆయన తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.
తాజాగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గౌరవం లేని చోట తాను ఉండలేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. రెండు రోజుల్లో అనుచరులతో చర్చించిన అనంతరం తన తదుపరి నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply