రచ్చకెక్కిన వివాహేతర సంబంధం పంచాయితీ.. పీఎస్‌లోనే ఫైటింగ్
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
తొలుత మాటల యుద్ధంగా ప్రారంభమైన వివాదం, ఆపై పరస్పర దాడులకు మారింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లాయి. స్టేషన్ ప్రాంగణంలోనూ ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.
సంఘటన సమయంలో వినాయక నిమజ్జనం బందోబస్తు విధుల్లో త్రీ టౌన్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. దీంతో స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉండటంతో హల్‌చల్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఇరువర్గాలకు చెందిన వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అప్రమత్తమైన నైట్ డ్యూటీ కానిస్టేబుళ్లు వెంటనే స్పందించి, ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు పాల్పడిన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.