తెలంగాణ సాయుధ పోరాట విశిష్టతను గ్రామ గ్రామాన వెల్లడించాలి: సీపీఎం నేతలు
అణచివేత, దోపిడీ, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ పేద ప్రజలను ఆత్మగౌరవంతో నిలబెట్టి, బంధూకులు చేతపట్టించి నిరంకుశ పాలకులైన జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు, పటేల్‌లు, పట్వారీలు, రజాకార్లను గ్రామాల నుంచి పట్టణాల వైపు వెళ్లేలా చేసిన మహత్తర పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వారు అభివర్ణించారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతి ఆరోపించారు. ఈ పోరాటాన్ని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా వక్రీకరిస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, దాని విశిష్టతను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. సమావేశంలో మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.