తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస చార్జీ రూ.30గా ఖరారు
తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీలను పెంచుతూ రవాణా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛార్జీల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్ల కనీస ప్రయాణానికి రూ.30గా ఛార్జీని ఖరారు చేశారు.
1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఆటోలో ప్రయాణికులు వేచి ఉండే సమయానికి నిమిషానికి 75 పైసల చొప్పున వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది.
రాత్రి వేళ అదనపు ఛార్జీలు
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణాలకు సాధారణ ఛార్జీపై అదనంగా ఒకటిన్నర రెట్లు వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
లగేజీకి ప్రత్యేక ఛార్జీ
బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్ మినహా ఇతర లగేజీ ప్యాకేజీలకు ఒక్కోదానికి 50 పైసల చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నారు.
ప్రయాణికులు ఆటోలో గరిష్టంగా 100 కిలోగ్రాముల వరకు లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.