అడవిలింగాల్ జెడ్పిహెచ్‌ఎస్‌లో సైకిళ్లు, క్రీడా సామగ్రి పంపిణీ
ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల–ఆనంద విజ్ఞాన నిలయంలో విద్యార్థులకు సైకిళ్లు, క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని దాత పెరిక హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తన తల్లి పెరిక భాగ్యవతి స్మరణార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పెరిక హరికృష్ణ–చండీప్రియ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ
గత రెండేళ్లుగా విద్యార్థులకు స్టడీ చైర్స్, స్కూల్ బ్యాగులు, షూస్, వాటర్ బాటిల్స్ అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది విద్యార్థులకు హౌస్‌వైజ్ టీషర్ట్స్, ట్రోజర్స్, వాలీబాల్ తదితర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా సైకిళ్లు అందజేసి ప్రోత్సహించారు.
చదువు, క్రీడల్లో ప్రోత్సాహం
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువు, క్రీడల్లో ముందుండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ రాజులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లలమర్రి శివ నరసింహరావు, ఉపాధ్యాయులు బి. విజయ్ కుమార్, పి. సిద్ధిరామ గౌడ్, జె. రమేష్, జి. శ్రీధర్, ఏ. మురళీమోహన్, చిన్న గంగారం రాజమణి, ఎన్. విజయ్ కుమార్, స్వప్న, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.
దాత హరికృష్ణ సేవలను అందరూ అభినందించారు. ఈ సేవా కార్యక్రమం ఇతర దాతలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని పాఠశాల యాజమాన్యం కోరింది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.