పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ | ఎల్లారెడ్డి
తాజా వార్త ఎల్లారెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి

పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ

అనారోగ్య చికిత్సకు లక్షల్లో ఖర్చు చేసిన కుటుంబాలకు ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు చొరవతో ఆర్థిక సహాయం

లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయం

తస్లీమా బేగం కుటుంబం
₹1,28,000
పుట్లూరి కిరణ్ కుమార్ కుటుంబం
₹60,000
మొత్తం మంజూరైన సహాయం ₹1,88,000

ఎల్లారెడ్డి: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందింది.

స్థానిక కౌన్సిలర్ల విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.

స్థానిక కౌన్సిలర్ల విజ్ఞప్తి మేరకు తస్లీమా బేగం, పుట్లూరి కిరణ్ కుమార్ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలని గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్‌మోహన్ రావు గారిని సంప్రదించారు.

స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తస్లీమా బేగంకు రూ.1,28,000, పుట్లూరి కిరణ్ కుమార్‌కు రూ.60,000 ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా మంజూరైన చెక్కులను సోమవారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

  • సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్
  • కౌన్సిలర్ గాదె తిరుపతి
  • కౌన్సిలర్ దశరథం
  • కౌన్సిలర్ గఫార్
  • కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్
  • కాంగ్రెస్ నాయకులు రఫీక్
  • తదితరులు పాల్గొన్నారు
లబ్ధిదారుల కుటుంబాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
తెలంగాణ పవర్
ప్రజల గొంతుకే మా కలం… సత్యమే మా బలం
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply