ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం, బూట్ల పంపిణీ
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు యూనిఫాం దుస్తులు, బూట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మా శ్రీకాంత్, స్థానిక కౌన్సిలర్లు హాజరై విద్యార్థులకు స్వయంగా దుస్తులు, బూట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మా శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలు, క్రమశిక్షణలోనూ ముందంజలో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు రఫీక్, కౌన్సిలర్ తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు పప్పు వెంకటేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.