కౌకూర్‌ను మోడల్ కౌకూర్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యం.. బస్‌స్టాప్ జంక్షన్ అభివృద్ధికి చర్యలు
కౌకూర్ బస్‌స్టాప్ జంక్షన్‌ను ప్రధాన జంక్షన్‌గా అభివృద్ధి చేసి, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నట్లు మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్ తెలిపారు.
కౌకూర్ బస్‌స్టాప్ జంక్షన్‌లోని వినాయక నిమజ్జన చెరువు వద్ద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు.
అనంతరం జోనల్ కమిషనర్ సాంచిత్ గంగ్వార్, డీఈ పద్మలతతో కలిసి కౌకూర్ బస్‌స్టాప్ సర్కిల్‌ను ప్రధాన జంక్షన్‌గా అభివృద్ధి చేయడం, ట్రాఫిక్ మరియు ప్రజల సౌకర్యాల కోసం అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు.
కౌకూర్ బస్‌స్టాప్ జంక్షన్ అభివృద్ధిపై ఇప్పటికే పలుమార్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులతో కలిసి పరిశీలనలు నిర్వహించినట్లు మల్లికార్జున్ తెలిపారు. విద్యుత్ స్తంభాల మార్పిడి ప్రక్రియ ప్రస్తుతం అంచనా దశలో ఉందని, సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
“కౌకూర్‌ను మోడల్ కౌకూర్‌గా తీర్చిదిద్దడమే మా ప్రధాన అజెండా. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్యం, ట్రాఫిక్ తదితర అన్ని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రజల అవసరాలే మా మొదటి ప్రాధాన్యత” అని మల్లికార్జున్ అన్నారు.
2024లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంత్ రావు చొరవతో అల్వాల్ మున్సిపల్ పరిధిలోని కౌకూర్‌లో వినాయక నిమజ్జన చెరువు ఏర్పాటు చేసినట్లు మల్లికార్జున్ గుర్తుచేశారు. కౌకూర్ ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో ముందుకు సాగాయని తెలిపారు.
కౌకూర్ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో తోట లక్ష్మీకాంత్ రెడ్డి భాగస్వామ్యం, సహకారం కూడా ఉందని మల్లికార్జున్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేయడంలో ఆయన సహకరిస్తున్నారని తెలిపారు.
చాలా రోజుల తర్వాత మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ తమతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మల్లికార్జున్ అన్నారు. కౌకూర్ అభివృద్ధికి ఆయన సహకారం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, అలీ మల్లేష్, అసిఫుల్లా ఖాన్, అలీ పాండు, సయ్యద్ అస్లాం, గౌరీనాథ్, గోమారం అంజిరెడ్డి, ధర్మారావు, కృష్ణ ముదిరాజ్, వెంకటేశ్వర్లు, సత్తి రెడ్డి, చిత్ర గోకుల్, పుష్ప, వాణి తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.