కౌకూర్‌లో మోడల్ మార్కెట్‌పై నిర్ణయం పునఃపరిశీలన.. విజయోత్సవాలు
కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని ఎక్సైజ్ స్టేషన్‌కు కేటాయించాలనే నిర్ణయం పునఃపరిశీలనకు రావడం, మోడల్ మార్కెట్‌ను ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి కౌకూర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు చిత్రపటానికి కౌకూర్ ప్రజలు పాలాభిషేకం చేసి విజయోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ అభిమానం, కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
మోడల్ మార్కెట్‌ను ప్రజా ప్రయోజనాల కోసం కాపాడేందుకు తుడిమెళ్ల మల్లికార్జున్ ప్రజలతో కలిసి ముందుండి పోరాడారని కార్యక్రమంలో పేర్కొన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మైనంపల్లి హనుమంత్ రావు నాయకత్వం, కృషి కారణంగానే ఈ నిర్ణయం పునఃపరిశీలనకు వచ్చిందని కౌకూర్ ప్రజలు పేర్కొన్నారు.
“మోడల్ మార్కెట్ విజయం ఒక్కరి విజయం కాదు… ఇది కౌకూర్ ప్రజల విజయం” అని తుడిమెళ్ల మల్లికార్జున్ పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజనాల కోసం ప్రజలు ఐక్యంగా నిలిస్తే విజయం సాధించవచ్చని ఈ పరిణామం చూపించిందని అన్నారు.
కౌకూర్ ప్రజలకు తుడిమెళ్ల మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మైనంపల్లి హనుమంత్ రావు నాయకత్వంలో భవిష్యత్తులోనూ ప్రజలతో కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.