సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వీజీపీపీ శిక్షణ

యెల్లారెడ్డి: యెల్లారెడ్డి మండలంలోని మీసాన్‌పల్లి రైతు వేదికలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (వీజీపీపీ) తయారీపై యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాలకు చెందిన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వీజీపీపీ తయారీకి సంబంధించి అధికారులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. 2026 అక్టోబర్ 2వ తేదీలోగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు నిర్వహించి వీజీపీపీ తయారీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

వీజీపీపీలో సూచించిన 375 పనుల నుంచి గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేసి వీజీపీపీలో చేర్చాలని అధికారులు తెలిపారు. పనుల ప్రణాళిక రూపొందించే ముందు ప్రతి గ్రామంలో విలేజ్ రిసోర్స్ మ్యాప్, విలేజ్ సోషల్ మ్యాప్‌లను తప్పనిసరిగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, ప్రస్తుత మౌలిక వసతులు, అభివృద్ధి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో వీజీపీపీ రూపొందించాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ, డీపీఓ, యెల్లారెడ్డి, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గ్రామాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి వీజీపీపీని సమర్థవంతంగా రూపొందించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply