బిచ్కుంద భద్రాల్ తండాలో ఎడ్ల పొలాల అమావాస్య మహా భోగ్ భండార్ పూజ
శ్రావణ మాసం ముగింపు సందర్భంగా బిచ్కుంద భద్రాల్ తండాలోని శ్రీ జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ మందిరంలో ఎడ్ల పొలాల అమావాస్య మహా భోగ్ భండార్ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మందిరం పూజారి సల్కాబాయి, శ్రీనివాస్ (శీను) మహారాజ్ ఆధ్వర్యంలో జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్, రామరావు మహారాజ్‌లకు మహా భోగ్ భండార్, ఆరతి, అర్డాస్ వినతి కార్యక్రమాలను నిర్వహించారు.
గత నెల రోజులుగా కొనసాగుతున్న భజన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముగించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అమ్మవారి, సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మందిరం పూజారి సల్కాబాయి అర్డాస్ చేసి భగవంతునికి ప్రార్థించారు.
భక్తుల వృత్తి, వ్యాపారాల్లో మంచి జరగాలని, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని, పిల్లలకు మంచి చదువు రావాలని, అందరికీ మేలు జరగాలని ఆమె ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మందిరం పూజారి సల్కాబాయి, శ్రీనివాస్ మహారాజ్, జాదవ్ దీప్చంద్, జాదవ్ శీను మహారాజ్, జాదవ్ బాబు మీసేవ, దేవిదాస్ మహారాజ్, కిషన్ మహారాజ్, కోట్య, తండా పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.