గార్ల మండల ఆదివాసీ ST సెల్ అధ్యక్షుడిగా భూక్యా బాబులాల్ నాయక్ నియామకం
గార్ల మండల ఆదివాసీ ST సెల్ అధ్యక్షుడిగా భూక్యా బాబులాల్ నాయక్‌ను నియమించారు. గార్ల మండల కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
శాసనసభ్యుడు కోరం కనకయ్య, పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ ST సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, DCC చైర్మన్ భూక్యా ఉమా మురళి నాయక్, మహబూబాబాద్ జిల్లా ఆదివాసీ ST సెల్ అధ్యక్షుడు బానోత్ ప్రసాద్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గార్ల మండల సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో భూక్యా బాబులాల్ నాయక్‌కు నియామక పత్రం అందజేశారు.
కృతజ్ఞతలు తెలిపిన భూక్యా బాబులాల్ నాయక్
తన నియామకానికి సహకరించిన ఇల్లందు శాసనసభ్యుడు, తెలంగాణ స్టేట్ అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్యకు, గార్ల మండలం సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్‌కు భూక్యా బాబులాల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్, ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా నాగేశ్వరావు, గార్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతీరామ్ నాయక్, జిల్లా నాయకులు షైక్ యాకుబ్ పాషా, ఇస్లావత్ రావుజీ, దికొండ రాము, ఉపేందర్ రెడ్డి, భూక్యా శ్రీను, ధరవత్ వీరన్న, మైస ఐలేష్, నాగరాజు, మెహరాజ్, ఆనంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.