గార్ల మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు నక్క శివకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్‌లో మండల కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ గార్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనార్టీ మోర్చా మాజీ కార్యదర్శి రావుక విమల్ కుమార్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ప్రజల మన్ననలు పొందుతూ, దేశ రక్షణను ప్రధాన ధ్యేయంగా భావిస్తూ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు.
“ప్రధాని నరేంద్ర మోదీకి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ దేశ ప్రజలను కాపాడుతూ, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం” అని విమల్ కుమార్ జైన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గార్ల మండల నాయకులు గుగులోత్ దేవ, ప్రధాన కార్యదర్శి గోన సాయికృష్ణ, మచ్చ విజయ్, అసెంబ్లీ కోకన్వీనర్ తోడేటి నాగరాజు, జిల్లా నాయకులు గుగులోతు గణేష్, కత్తి రాజేష్, రాంబాబు, బీజేవైఎం మండల అధ్యక్షుడు బోడసోనియా, హరికృష్ణ, వీరస్వామి, అజ్మీర రామ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.