గణేష్ విగ్రహాల తయారీ షెడ్లను పరిశీలించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఎదులాబాద్ డివిజన్ ఘనపూర్‌లో భారీ గణేష్ విగ్రహాన్ని తరలించే సమయంలో పైభాగంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నేపథ్యంలో మేడ్చల్ బీజేపీ ఇన్‌చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి విగ్రహాల తయారీ షెడ్లను పరిశీలించారు.

ఈ ఘటనపై ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ గణేష్ విగ్రహాల తయారీదారులు, నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

నియోజకవర్గ పరిధిలో ఎన్ని విగ్రహాల తయారీ షెడ్లు ఉన్నాయో గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను అవసరమైన మేరకు మార్పులు చేయాలని సంబంధిత విద్యుత్ అధికారులను ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒక యువకుడి ప్రాణం పోవడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనకు కారణమైన నిర్లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.

పెద్ద వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తేనే గొప్ప భక్తులం అవుతామని అనుకోవద్దని ఆయన అన్నారు. హిందువులందరూ కలిసికట్టుగా భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరి భద్రతకు బాధ్యత వహించాలని కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తలు పాటించి సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మహేష్, విరారెడ్డి, విక్రాంత్ రెడ్డి, గుండె నరేష్, రామ్ నాయక్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply