గిరివర్ధన్ రెడ్డికి ఘన సన్మానం.. ఉమ్మడి గాజులరామారం బీజేపీ నేతల శుభాకాంక్షలు
కుత్బుల్లాపూర్: ఉమ్మడి గాజులరామారం డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు నూతనంగా ఎన్నికైన మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఉమ్మడి గాజులరామారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో నాయకులు గిరివర్ధన్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గిరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి గాజులరామారం డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. వారి మంచి–చెడు, కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర మాజీ మీడియా కో-కన్వీనర్ రేవతి రెడ్డి, జిల్లా మాజీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి గాజులరామారం డివిజన్ కార్యదర్శి జి. శ్రీనివాస్, సీనియర్ నాయకులు సమంతుల రాజుతో పాటు శారద, రమాదేవి, వెంకట్, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డి. గిరివర్ధన్ రెడ్డికి నాయకులు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.